అమెరికా దేశంలోని చికాగో నగరంలో భారతీయ కళలకు, అన్నమాచార్య సంగీత సాహిత్య నృత్య సంప్రదాయాలను కాపాడటంలో గత 32 ఏళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్నట్లు స్వప్న సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. తమ సంస్థ చేస్తున్న సేవలను వివరిస్తూ... "స్వప్నా-32" పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఈ నెల 28న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించినట్లు సంస్థ ఛైర్మన్ డాక్టర్ శ్రీరామ్ సొంటి, వ్యవస్థాపకురాలు శారదా పూర్ణ సొంటి తెలిపారు.
ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 1న బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించబోతున్న పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.ఎం.హరికృష్ణ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణ కుంభమేళాకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?