సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంటనగరాల్లో నిరుపేదలకు కూడా అధునాతన వైద్య సదుపాయాలు కల్పించి వారి బాగోగులకు తమ వంతు కృషి చేస్తున్నామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండిలోని నూతన క్యాంపు కార్యాలయంలో 40 మందికి రూ.20 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కువ సంఖ్యలో రోగులకు తెరాస ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచిందని పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని పేద ప్రజలకు తాము నిత్యం అందుబాటులో నిలుస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, రాసురి సునీత, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉత్తమ్ సమక్షంలోనే కాంగ్రెస్ నాయకుల గొడవ