ETV Bharat / state

తెరాస సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: పద్మారావు గౌడ్​

సికింద్రాబాద్​ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్​ ప్రారంభించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఉప సభాపతి కోరారు.

deputy speaker padma rao goud
ఉపసభాపతి పద్మారావు గౌడ్​
author img

By

Published : Feb 15, 2021, 7:33 PM IST

తెరాస సభ్యత్వ నమోదులో సికింద్రాబాద్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలస్తుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సీతాఫల్​మండి డివిజన్​లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించారు.

తెరాసకు సికింద్రాబాద్ నియోజకవర్గం కంచు కోటగా నిలిచిందని పద్మారావు గౌడ్​ అన్నారు. ప్రజారంజకమైన పాలనను ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి వివిధ సదుపాయాలు ఉంటాయని పద్మారావు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని.. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సభ్యత్వం చేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఇన్​ఛార్జి నరేంద్రనాథ్, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస సమన్వయకర్తలు తదితరులు ల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆ రోజుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.