ETV Bharat / state

'కొవిడ్‌ బాధితుల బిడ్డలకు మాదీ భరోసా' - తెలంగాణలో చిన్నారులకు సంరక్షణ కేంద్రాలు

తల్లిదండ్రులు, సంరక్షకులు కొవిడ్‌ బారిన పడితే తాత్కాలికంగా వారి పిల్లల బాధ్యతను తాము తీసుకుంటున్నామని.. దురదృష్టవశాత్తు చిన్నారులెవరైనా అయినవాళ్లను కోల్పోయి అనాథలైతే వారిని తామే అక్కున చేర్చుకుని.. వారి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య తెలిపారు. భర్తను కోల్పోయి పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, చిన్నారుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, అంగన్‌వాడీ, చైల్డ్‌లైన్‌, కరోనా సహాయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. అవసరమైనవారు సహాయం కోసం ఎప్పుడైనా కాల్‌ చేయవచ్చన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కరోనావేళ మహిళా శిశు సంక్షేమశాఖ సన్నద్ధతపై ఆమె ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

department-of-women-and-child-welfare-special-secretary-divya-interview
'కొవిడ్‌ బాధితుల బిడ్డలకు మాదీ భరోసా'
author img

By

Published : May 24, 2021, 10:18 AM IST

కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు చనిపోయి ఎంతోమంది పిల్లలు అనాథలవుతున్నారు. వారికి ఏం సహాయం చేస్తున్నారు?
శిశు సంక్షేమశాఖ తరఫున 040-23733665, 1098 నంబరుతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సహాయం కోసం ఇప్పటివరకు వచ్చిన 540 కాల్స్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చనిపోతే.. ఆ బాలలకు అవసరమైన సహాయం చేస్తున్నాం. తల్లిదండ్రులు పాజిటివ్‌ వస్తే వారి పిల్లలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటులోని 440 సంరక్షణ కేంద్రాల్లో సాకుతున్నాం. జిల్లా శిశు సంరక్షణ యూనిట్లకు వాహనాలు సమకూర్చాం. అత్యవసర ఖర్చుల కోసం రూ.లక్ష చొప్పున నిధులు ఇచ్చాం. సహాయ కేంద్రానికి ప్రతిరోజూ 30 వరకు కాల్స్‌ వస్తున్నాయి.
అనాథ పిల్లలున్నారు. దత్తత తీసుకోమంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి. అవి నిజమైనవేనా?
అక్రమ దత్తత నేరం. ఇది చిన్నారుల అక్రమ రవాణాకు దారితీస్తుంది. దిల్లీ నుంచి ఇలాంటి మెసేజ్‌లు వస్తున్న విషయం మా దృష్టికి రాగానే కేంద్రీయ దత్తత వనరుల కేంద్రానికి (కారా) తెలిపాం. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదయ్యాయి. పిల్లలు కావాలనుకునే వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. ముందుగా కారా వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. మా సహాయ కేంద్రానికి ఇప్పటి వరకు 52 మంది ఫోన్‌ చేశారు.
అంగన్‌వాడీ లబ్ధిదారులకు కొన్ని సరకులు అందడం లేదంటున్నారు?
కొవిడ్‌ తరువాత లబ్ధిదారులకు ఇంటి వద్దే సరకులు అందిస్తున్నాం. లాక్‌డౌన్‌లోనూ నూరుశాతం పంపిణీ చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరిలో టెండరు ప్రక్రియలో న్యాయవివాదం కారణంగా పంపిణీలో ఇబ్బందులు వచ్చాయి. మార్చి నుంచి ఆటంకాలు లేవు. గుడ్ల పంపిణీ 95 శాతానికి పైగా ఉంటోంది. ఆర్టీసీ రవాణా ద్వారా నూనె పంపిణీ సమస్యను అధిగమించాం. మారుమూల ఉండే ఆదిలాబాద్‌ జిల్లాలోనే పంపిణీ 97 శాతానికి పైగా ఉంది. ఏవైనా సమస్యలు ఎదురైతే లబ్ధిదారులు 155209 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.
కరోనాతో బాల్యవివాహాలు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు ఏం చేస్తున్నారు?
బాల్యవివాహాలపై ప్రజలు 1098కు సమాచారమిచ్చిన వెంటనే బాలల సంరక్షణ అధికారులు పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సహాయంతో చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక నాలుగేళ్లుగా బాల్యవివాహాలు తగ్గాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని చెబుతోంది. అయితే కరోనా ఆ పరిస్థితిని మార్చేస్తోంది. గత ఏడాది కాలంలో 1,355 బాల్యవివాహాలను అడ్డుకున్నాం. రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తాం.
గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే 1800 599 12345 నంబరు సిద్ధం చేసింది. అంగన్‌వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. శిశు సంక్షేమ అధికారులు లబ్ధిదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికీ గర్భిణులు, బాలింతలు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా? పాజిటివ్‌ ఉంటే పిల్లలకు పాలు ఇవ్వవచ్చా? తదితర సందేహాలు ఉన్నాయి. సహాయ కేంద్రానికి ఫోన్‌ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఇటీవల వరంగల్‌ జిల్లా నుంచి అర్ధరాత్రి కాల్‌సెంటర్‌కు ఫోన్‌ వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. ఐదునెలల చిన్నారిని తల్లి దగ్గరకు రానీయలేదు. పాలు లేకపోవడంతో పాప నీరసించి పోయింది. వెంటనే శిశు సంక్షేమ అధికారులు వెళ్లి పాపను ఆసుపత్రిలో చేర్చారు.
తల్లిదండ్రులకు కరోనా సోకితే వారి పిల్లల కోసం సంరక్షణ గృహాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
జిల్లాకు ఒకటి లేదా రెండు చొప్పున సంరక్షణ కేంద్రాలను గుర్తించాం. పిల్లలను వాటిలో సాకుతున్నాం. తల్లిదండ్రులతో ప్రతిరోజూ వీడియో కాల్‌ మాట్లాడిస్తాం. 24 గంటలూ భద్రత కల్పిస్తున్నాం. పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఆడుకునేందుకు బొమ్మలు, చదువుకునేందుకు పుస్తకాలు సమకూర్చాం. అన్ని కేంద్రాల్లోనూ టీవీలు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి: ప్రాజెక్ట్‌ మదద్‌.. కరోనా పల్లెలకు అండగా ప్రవాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.