నిబంధనలు పాటించని కారణంగా రిలయన్స్ స్మార్ట్‌పై మూడు కేసులు నమోదు చేశారు అధికారులు. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయగుట్టలో తనిఖీలు నిర్వహించిన తూనికలు, కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇతర మెడికల్, కిరాణా, మాల్స్‌పై కూడా ఆకస్మిక దాడులు నిర్వహించారు.
చాంద్రాయగుట్టలోని రిలయన్స్ స్మార్ట్‌లో తనిఖీలు చేయగా.. పాల డబ్బా ప్రొడక్ట్‌పై కాలపరిమితి ప్రింట్ లేకపోవడం.. 25 కిలోల బియ్యం బస్తాలో అర కేజీ తక్కువ రావడం అదేవిధంగా లైసెన్స్ రెన్యూవల్ లేనందున మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. ఎవరైనా వస్తువులు ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్వో తనూజ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.