ETV Bharat / state

Registration Department: వ్యవసాయ భూముల విలువల్లో భారీ మార్పులు - హైదరాబాద్ వార్తలు

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులతోపాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే 20 రకాల సేవల విలువలు పెరగనున్నాయి. వ్యవసాయేతర భూముల ఆస్తుల విలువ గరిష్టంగా 50 శాతం వరకు పెరగనున్నాయి. వ్యవసాయ భూములు విలువలో నాలుగు వందల శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.

Department of Stamps Registration
భూముల ఆస్తుల విలువ
author img

By

Published : Jul 6, 2021, 7:11 AM IST

రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ(Department of Stamps Registration) ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్‌ శాఖ(Registration ‌ Department ) ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్‌ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్‌, తత్సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నారు. తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనుండగా.. ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా ప్రక్రియ కొనసాగుతోంది.

పెంపు ఇందుకే

రాష్ట్రంలో భూముల విలువను పెంచడానికి దారితీసిన వివిధ అంశాలను ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది. సర్కారు నిర్దేశించిన అంశాల నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువ పెంపు ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ చేపట్టి ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌(Somesh Kumar) ఆదేశించారు.

  • ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి.
  • నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది.
  • రాష్ట్రంలో ఐటీ, ఔషధ, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువలు సవరించాలి.
  • గతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెంట్రల్‌ వాల్యుయేషన్‌ సలహా కమిటీ (Central Valuation Advisory Committee) భూముల విలువను సవరించాలని ప్రతిపాదించింది.

ఏమేం పెరగనున్నాయ్‌..

భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై పెరగనున్నవి.

  • భూముల విలువ
  • రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
  • విక్రయ అగ్రిమెంట్‌/జీపీఏ
  • డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, జీపీఏ
  • డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌
  • కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
  • కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు
  • బహుమతి(గిఫ్ట్‌)
  • టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌
  • జీపీఏ (ఆథరైజేషన్‌తో, ఆథరైజేషన్‌ లేకుండా)
  • వీలునామా
  • లీజు సహా ఇతర సేవల ఛార్జీలు

2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని భూముల విలువను నిర్ధారిస్తున్నారు. గతంలో ప్రతిపాదనలు రూపొందించినపుడు ప్రాంతీయ రింగ్‌రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి వచ్చిన క్రమంలో దానికి చేరువలో భూముల మార్కెట్‌ విలువ భారీగా పెరగటాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: Balanagar flyover: నేడు బాలానగర్‌లో ఫ్లైఓవర్‌ ప్రారంభం.. ఇదే ప్రత్యేకత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.