ETV Bharat / state

విశాఖలో గీతం కాలేజ్​ వైపు నిర్మాణాలు కూల్చివేత?

Demolition: ఏపీలో నిర్మాణాల కూల్చివేత పర్వం ఆగడంలేదు. నేడు విశాఖలోని గీతం మెడికల్​ కాలేజ్​ వైపు ఉన్న నిర్మాణాలను కూల్చడానికి అధికారులు సన్నాహం చేస్తున్నారు. తెల్లవారుజామున 4గంటల నుంచే ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

geetham
ఏపీలో కట్టడాలు కూల్చివేత
author img

By

Published : Jan 6, 2023, 11:54 AM IST

Demolition: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలోని గీతం మెడికల్ కళాశాల వైపు నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కూల్చివేత సామగ్రితో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఎండాడ, రుషికొండ వైపు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రాకపోకల నిలిపివేతకు పోలీసులు చర్యలు చేపట్టారు. గీతం వర్సిటీ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

కళాశాల వద్ద ఉద్రిక్తత : గీతం వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల వద్ద, గీతం వర్సిటీ ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెవెన్యూ అధికారులు కళాశాల మైదానాన్ని స్వాధీన పరుచుకుని.. దాని చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎండాడ వైపు, రుషికొండ మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పహారా కాస్తున్నారు. కళాశాల మైదానంలో భీమిలి ఆర్డీవో, విశాఖ డీఆర్‌వో పర్యవేక్షిస్తున్నారు.

కళాశాలను అనుకొని 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనపరచుకున్నట్లు భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. రుషికొండ గ్రామ సర్వే నం.37, 38లోని స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీవో వివరించారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని.. ఇవాళ 5.25 ఎకరాల్లో కంచె వేశామని ఆయన వెల్లడించారు. పని తొందరగా జరగాలనే తెల్లవారుజాము నుంచి కంచె పనులు ప్రారంభించమని అన్నారు. పదిచోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని.. ఇద్దరు తహశీల్దార్లు పర్యవేక్షిస్తున్నారని ఆర్డీవో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.