దిల్లీలో నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింల కుటుంబాలను వారితో సన్నిహితంగా మెలిగిన వారిని అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు వందల మంది వైరస్ నిర్ధారణ కోసం గాంధీకి వచ్చిన నేపథ్యంలో వార్డు మొత్తం కిక్కిరిసిపోయింది.
రక్తనమూనా పరీక్షల కోసం వచ్చిన ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గాంధీ ఆస్పత్రి వర్గాలు... ఆస్పత్రి ఎదుట ఉన్న టెంట్లోకి తీసుకెళ్లారు. వచ్చిన వారు సమూహాలుగా ఉండకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పలువురికి పరీక్ష చేసి... ఇళ్లకు పంపి హోమ్ క్వారంటైన్ పాటించాలని సూచించారు. లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రిలోని ఓపి క్వారంటైన్ వుంచారు.
ఇవీ చూడండి: ఆంధ్రప్రదేశ్లో 24 గంటల్లో 21 కరోనా కేసులు