ETV Bharat / state

Delay in agricultural loans : రుణం అందడం లేదు... "సాగు" సాగడంలేదు.. - తెలంగాణలో వ్యవసాయ రుణాల ఆలస్యం

Delay in agricultural loans : ఘనమైన లక్ష్యాలు.. భారీ ప్రణాళికలు.. ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది రాష్ట్రంలో పంట రుణాల పరిస్థితి. వ్యవసాయం ప్రధానంగా ఉన్న రాష్ట్రంలో బ్యాంకుల నుంచి అన్నదాతకు అందుతున్న తోడ్పాటు పరిమితంగానే ఉంటోంది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు చిన్న సన్నకారు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు లక్ష్యం చేరుకోవడం లేదు. సాగుకు పెట్టుబడి రుణాలను పెంచాలని బ్యాంకులకు నాబార్డ్‌ సూచిస్తున్నా ఆశించిన మేర ముందుకు సాగడంలేదు.

farmar
farmar
author img

By

Published : Feb 7, 2022, 6:42 AM IST

Delay in agricultural loans : వ్యవసాయానికి పెట్టుబడుల అవసరం పెరిగేకొద్దీ సంస్థాగతంగా రుణం తగ్గుతోంది. నాబార్డ్‌ ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర దార్శనిక పత్రంలో వ్యవసాయరంగానికి రుణాల ప్రాధాన్యాన్ని మరోమారు స్పష్టం చేసింది. రుణాలను ఇవ్వడంలో ప్రధానంగా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి కీలకంగా ఉండే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల వార్షిక ప్రణాళికలో 77% లక్ష్యం చేరుకున్నట్లు పేర్కొంది. రుణాలను అందించడంలో గ్రామీణ, సహకార బ్యాంకులు లక్ష్యాలను చేరుకుంటున్నా జాతీయ బ్యాంకులు అందుకోవడం లేదని విశ్లేషించింది. గ్రామీణ బ్యాంకులు లక్ష్యం కంటే ఎక్కువగా ఇస్తుండగా సహకార బ్యాంకులు లక్ష్యంలో 96 శాతం చేరినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యధికం చిన్న, సన్నకారు రైతులే ఉండగా ప్రధానంగా వరి, పత్తి పంటపైనే వారు ఆధారపడుతున్నట్లు పేర్కొంది. గత ఏడాది వ్యవసాయ రుణ ప్రణాళికను 14.16శాతం పెంచింది. బ్యాంకు రుణాల్లో పంట రుణాలు అత్యంత కీలకమని పేర్కొంటూ ఈ లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

ఖరీఫ్‌ రుణాల్లో తీవ్ర జాప్యం

వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఖరీఫ్‌ రుణాలపై బ్యాంకుల ఉదాసీనత వెల్లడవుతోంది. జనవరి ఆఖరు నాటికే నాబార్డ్‌ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికను విడుదల చేస్తున్నా బ్యాంకర్ల సమితి రుణ ప్రణాళికలో జాప్యం జరుగుతోంది. ఎస్‌ఎల్‌బీసీ రాష్ట్ర రుణ ప్రణాళికను ఆమోదించి దీనికి అనుగుణంగా జిల్లాల్లో లీడ్‌ బ్యాంకులు ఆధ్వర్యంలో జిల్లా రుణ ప్రణాళికలు ఆమోదించడంలో ఆలస్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్‌ రుణాలివ్వడం ఆలస్యంగా ప్రారంభమవడమే కాకుండా లక్ష్యం చేరడంలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీజన్‌ ప్రారంభమైన రెండు నెలలకు కూడా జిల్లా రుణ ప్రణాళికలు ఖరారు కాకపోవడంతో లక్ష్యం మేరకు రుణాలు అందలేదు.

.

ఇదీ చూడండి : Krishna River Pollution: కాలుష్య కోరల్లో కృష్ణా నది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.