డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశమిచ్చారు. జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.
రెండో విడత వెబ్ ఆప్షన్లు
జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశమిచ్చారు. ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశమిచ్చారు. ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వివరించారు.
ఇదీ చూడండి : ఈ చిట్కాలు పాటిస్తే.. అందం మీ సొంతం