ETV Bharat / state

కరోనా కాలంలో రాష్ట్రంలో తగ్గిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు..! - petro products sales Decreased in telangana

కరోనా సమయంలో రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు పడిపోగా.. గ్యాస్‌ వినియోగం దాదాపు పది శాతం పెరుగుదల నమోదు చేసింది. గత ఆర్థిక ఏడాదిలో 16 శాతానికిపైగా విక్రయాలు పడిపోయినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. వైరస్ ఉద్ధృతంగా ఉన్నా.. ఏప్రిల్‌లో విక్రయాలు భారీగానే ఉన్నాయని తెలిపాయి.

తగ్గిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు
తగ్గిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు
author img

By

Published : Apr 28, 2021, 3:30 AM IST

తగ్గిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు

కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావంతో గతేడాది డీజిల్‌, పెట్రోల్‌ విక్రయాలు పడిపోయాయని చమురు సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా ఏటికేడు వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ.. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు పెరుగుతాయి. కానీ కరోనా దెబ్బతో గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తుల విక్రయాలు పడిపోయాయి. లాక్‌డౌన్‌తో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోడంతో పెట్రో అమ్మకాలపై ప్రభావం పడింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో 16 లక్షల 63 వేల 562 కిలోలీటర్ల పెట్రోలు అమ్ముడుపోగా.. గత ఆర్థిక సంవత్సరం 15 లక్షల 40 వేల 973కిలో లీటర్లు మాత్రమే విక్రయాలు జరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అంటే 7.4 శాతం తగ్గి లక్షా 22 వేల 589 కిలో లీటర్లు తక్కువగా అమ్ముడైంది.

2019-20 ఆర్థిక ఏడాదిలో 31 లక్షల 58 వేల 502 కిలోలీటర్లు డీజిల్‌ అమ్ముడుపోగా.. 28 లక్షల 81 వేల 325కిలో లీటర్లు మాత్రమే విక్రయాలు జరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అంటే 8.8శాతం తగ్గి.. 2 లక్షల 77 వేల 177 కిలో లీటర్లు తక్కువగా విక్రయాలు తగ్గాయి. ఇదే సమయంలో వంట గ్యాస్‌ వినియోగం బాగా పెరిగింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో 817.4 మెట్రిక్‌ టన్నులు వాడకం జరగ్గా.. గత ఆర్థిక సంవత్సరం 9.8 శాతం పెరుగుదల నమోదు చేసి.. 987.8 మెట్రిక్‌ టన్నుల వినియోగం జరిగింది. అంటే 80.4 మెట్రిక్‌ టన్నులు అధికంగా వినియోగించినట్లు చమురు సంస్థల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్‌ ద్వారా 2019-20లో 9 వేల 583 కోట్లు రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 7 వేల 925 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం మీద 1,658 కోట్లు రాబడి తగ్గినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.