ETV Bharat / state

కరోనా దెబ్బకు ఏపీ ఆర్థిక పరిస్థితి కుదేలు - కరోనా దెబ్బతో తగ్గిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశపరిచింది. కేంద్ర పన్నుల వాటా, సొంతపన్నులు, పన్నేతర ఆదాయం ఏవీ అంచనాలను అందుకోలేదు. అంతకముందు ఏడాదితో పోలిస్తే కేంద్ర పన్నుల వాటా, రాష్ట్ర పన్నుల మొత్తంలోనే.... 8వేల 135 కోట్ల ఆదాయం తగ్గింది.

decreased-ap-financial-situation
కరోనా దెబ్బకు ఏపీ ఆర్థిక పరిస్థితి కుదేలు
author img

By

Published : Apr 19, 2020, 10:00 PM IST

కరోనా దెబ్బకు ఏపీ ఆర్థిక పరిస్థితి కుదేలు

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. కేంద్ర పన్నుల్లో వాటా సొంతపన్నులు, పన్నేతర రాబడీ అంతంతమాత్రంగానే సాగాయి. సాధారణంగా ఏటా ఆదాయాల్లో 10 నుంచి 15 శాతం వరకూ అదనంగా రాబడులు పెరుగుతాయనే అంచనాలుంటాయి. ఈసారి అది కార్యరూపం దాల్చలేదు. కేంద్ర పన్నుల్లో 34వేల833 కోట్ల వాటా వస్తుందని బడ్జెట్‌లో అంచనాలు రూపొందించుకోగా 26వేల 913 కోట్లు మాత్రమే వచ్చింది. అంతకముందు రెండు ఆర్థిక సంవత్సరాల కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ తరహా సరళి ఉందని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. ఇతర కారణాలతోపాటు ఆర్థిక ఏడాది చివరి నెలలో కరోనా సైతం రాబడులపై ప్రభావం చూపిందని అంటున్నారు.

సొంత పన్నుల ద్వారా ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతుందని.... లెక్కించుకుంటారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అది దాదాపు 2వేల 500 కోట్లు తగ్గిపోయింది. గత ఐదేళ్ల లెక్కలు చూస్తే 2018-19 వరకూ ఈ ఆదాయం 5వేల కోట్ల నుంచి 9వేల కోట్ల రూపాయలకు పెరుగుతూ వచ్చింది. పన్నేతర ఆదాయంలోనూ అంతకముందు ఏడాదితో పోలిస్తే బాగా వ్యత్యాసం కనిపించింది. ఏకంగా 1200 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఏపీలో ఎక్సైజ్‌ విధానం మారినా ఆ రూపేణా వచ్చేఆదాయంలో ఎలాంటి తగ్గుదల లేదు. కిందటి ఏడాదితో పోలిస్తే రాబడి కొంత పెరిగినా 8వేల 500 కోట్లఅంచనాను మాత్రం అందుకోలేకపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.