ETV Bharat / state

తెలుగు అక్షరమాల, అంకెలతో నగరానికి అలంకరణ - telugu language

ఇటాలియన్ ఆఫ్‌ ది ఈస్ట్‌గా చరిత్రకారులు అభివర్ణించినా... దేశ భాషలందు లెస్స అని రాయల వారు కీర్తించినా అది మన తెలుగు భాషకు దక్కిన కీర్తికిరీటం. అలాంటి మధురమైన మాతృభాషను ముందు తరాలు మరవకుండా కర్నూలు నగరపాలక సంస్థ చేస్తున్న ప్రయత్నం మన్ననలు అందుకుంటోంది. తెలుగు వర్ణమాలను నగరంలో అందంగా తీర్చిదిద్దారు.

తెలుగు అక్షరమాల, అంకెలతో నగరానికి అలంకరణ

author img

By

Published : Jan 16, 2021, 9:03 AM IST

తెలుగు అక్షరమాల, అంకెలతో నగరానికి అలంకరణ

వృత్తి జీవితం, ఆంగ్లం సహా పరభాషలపై మోజుతో.... మాతృభాషను మరవొద్దంటూ ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు నగరపాలక సంస్థ చేసిన ప్రయత్నం ఆలోచింపజేస్తోంది. సుంకేసుల రోడ్డులోని చిల్డ్రన్స్‌ పార్క్‌ సర్కిల్‌ నుంచి మదర్‌ థెరిసా కూడలి వరకు తెలుగు వర్ణమాల, తెలుగు అంకెలను రోడ్డు మధ్యలో అందంగా ఆవిష్కరించారు. రహదారికి ఇరువైపులా సుందరంగా ఏర్పాటు చేసిన ఈ అక్షరమాల విశేషంగా ఆకట్టుకుంటోంది..

ఆర్టీసీ బస్సుపై తెలుగు అంకెలను చూసిన నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలాజీకి... మాతృభాషను అందరూ గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. అంకెలతో పాటు తెలుగు అక్షరాలనూ గుర్తుచేయాల్సిన అవసరం ఉందనుకుని ఈ ప్రయత్నం చేశారు. వాహనదారులు చూసినపుడు... అక్షరాలన్నీ వరుస క్రమంలో కనిపించేలా ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ ప్రయత్నాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నారు.

కర్నూలు సుందరీకరణ పనుల్లో భాగంగా... ఈ ప్రయత్నం చేశామని... భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు కమిషనర్ బాలాజీ తెలిపారు. భవిష్యత్తులో నగరంలో వివిధ రకాల పక్షులు, సముద్రజీవుల ఆకారాల్లో బొమ్మలు ఏర్పాటుచేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ తెలిపారు.

ఇదీ చూడండి: సీరం టీకా 'కొవిషీల్డ్'​ ప్రత్యేకతలివే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.