ETV Bharat / state

ఆస్తిపన్ను చెల్లింపునకు రేపటితో ముగియనున్న గడువు - telangana varthalu

మార్చి 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడానికి గడువు ముగుస్తుందని జీహెచ్​ఎంసీ తెలిపింది. సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ-సేవా కేంద్రాలు, ఆన్​లైన్, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పన్నులు చెల్లించాలని కోరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు రూ.1559.38 కోట్ల ఆస్తిపన్ను వ‌సూలైనట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.

property tax
ఆస్తిపన్ను చెల్లింపునకు రేపటితో ముగియనున్న గడువు
author img

By

Published : Mar 30, 2021, 8:08 PM IST

జీహెచ్​ఎంసీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికి గడువు 31వ తేదీతో ముగుస్తుంద‌ని జీహెచ్ఎంసీ గుర్తు చేసింది. ఆస్తిప‌న్ను చెల్లించ‌డానికిగాను సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లన్నీ బుధవారం రాత్రి 12గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని.. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని ఆస్తిప‌న్ను చెల్లించాల‌ని న‌గ‌ర‌వాసుల‌కు జీహెచ్​ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లతో పాటు మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్, మై జీహెచ్​ఎంసీ యాప్​ ద్వారా కూడా త‌మ ఆస్తిప‌న్నును చెల్లించ‌వ‌చ్చని సూచించారు.

ఇప్పటి వ‌ర‌కు ఆస్తిప‌న్ను చెల్లించ‌ని వారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆస్తిప‌న్ను చెల్లించాల‌నే సందేశాలను జీహెచ్ఎంసీ పంపింది. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం ఆస్తిప‌న్ను ల‌క్ష్యం రూ.1900 కోట్లుగా నిర్ధారించింది. గత సంవత్సరం రూ.1800 కోట్లను నిర్ధారించగా... ఈ సారి రూ.100 కోట్లను పెంచింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వ‌ర‌కు రూ.1559.38 కోట్ల ఆస్తిపన్ను వ‌సూలైనట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.

ఇదీ చదవండి: అసైన్​మెంట్లు ఇంట్లో రాయండి... మెయిల్ ద్వారా పంపండి: ఇంటర్ బోర్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.