ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మందు తాగి పడిపోయాడనుకున్న విద్యార్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని చూసిన పోలీసులు... ఆ వ్యక్తి మరణించినట్లు నిర్ధరించారు. మృతదేహం వద్ద దొరికిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతుడు రాంనగర్ నివాసి నేరెళ్ల రమేశ్ గౌడ్‌గా గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రాంనగర్ బయోలాజికల్ లిమిటెడ్ కంపెనీలో ఫిల్లింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న ఇంటి నుంచి విధులకు వెళ్లిన రమేశ్ ఈరోజు ఓయూ మైదానంలో విగతజీవిగా కన్పించాడు. మృతదేహం వద్ద దొరికిన మందుసీసా, కూల్‌డ్రింక్, పాయిజన్ బాటిల్‌ను చూశాక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భార్యను ఫోన్లో సంప్రదించగా... రెండురోజులుగా కన్పించటంలేదని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి