లాక్ డౌన్‌ను ప్రజలు గౌరవిస్తున్నారని… ఉల్లంఘనలు చాలా వరకు తగ్గుతున్నాయని మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. గాంధీనగర్, ముషీరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని చెకింగ్ పాయింట్లను పరిశీలించారు. లాక్ డౌన్ సమయం ముగిసిన తర్వాత రోడ్లపై ఇబ్బడి ముబ్బడిగా వచ్చే వాహనాలను అదుపు చేయాలని డీసీపీ సూచించారు.
ప్రజల్లో లాక్డౌన్ పట్ల పూర్తి అవగాహన పెరిగిందని డీసీపీ అన్నారు. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. చిక్కడపల్లి డివిజన్లో ప్రతిరోజూ 400 వరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.