గోల్కొండ(golconda bonalu) జగదాంబ మహంకాళి ఆలయం బోనాల ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయం వద్ద పోలీసులు(telangana police) పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ(CCTV) కెమారాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. బోనాల ఉత్సవాల్లో మొత్తం 600 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్(COVID) నిబంధనలకనుగుణంగా వ్యవహరించకుంటే ఆలయంలోనికి అనుమతించబోమని సంయుక్త పోలీసు కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ(DCP) ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
'2019 బోనాల ఏర్పాట్లలో జరిగిన లోటుపాట్లను ఈసారి సవరించాం. మొత్తం 30 మంది ఇన్‌స్పెక్టర్లు, వంద మంది ఎస్సైలు, 700 మంది సిబ్బందితో భద్రత చర్యలు చేపట్టాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. కరోనా కారణంగా భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ విధిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. బోనం ఎత్తుకొని వచ్చే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.'
-ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ
ఇవీ చదవండి: