ETV Bharat / state

'వాజ్​పేయూ పాలనలో భారత్​ నూతన శక్తితో ముందుకెళ్లింది' - ex pm atal bihar birthday celebrations

మాజీ ప్రధాని అటల్​ బిహార్​ వాజ్​పేయీ జన్మదినం సందర్భంగా 'సుశాసన్​ దివాస్​' కార్యక్రమానికి హిమాచల్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాజ్​పేయి ప్రవర్తన, సమర్థవంతమైన పని తీరు.. ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సుపరిపాలనకు ఉదాహరణగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు.

dattatreya words about ex prime minister atal bihar vajpey
'వాజ్​పేయూ పాలనలో భారత్​ నూతన శక్తితో ముందుకెళ్లింది'
author img

By

Published : Dec 25, 2020, 7:02 PM IST

మాజీ ప్రధాని అటల్ బిహార్​ వాజ్‌పేయీకి దేశ ప్రయోజనాల కోసం అన్ని భావజాలాలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన సామర్థ్యం ఉందని హిమాచల్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. అది బలమైన ప్రజాస్వామ్యానికి అవసరమని పేర్కొన్నారు. శుక్రవారం వాజ్​పేయి జన్మదినం సందర్భంగా ‘'సుశాసన్ దివాస్'’ కార్యక్రమానికి దత్తాత్రేయ అధ్యక్షత వహించారు. ఉదారవాద ఆలోచన, ప్రజాస్వామ్య ఆదర్శాలకు వాజ్​పేయీ కట్టుబడి ఉంటారని దత్తాత్రేయ అన్నారు. ఆయన ప్రవర్తన, సమర్థవంతమైన పని శైలి ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన ప్రజాదరణ పార్టీ, రాజకీయ సరిహద్దులకు మించి ఉందని కొనియాడారు.

భారత్​ను నూతన శక్తిగా

రాజకీయ ప్రత్యర్థులు కూడా అటల్​ జీ పట్ల ఆప్యాయత, గౌరవం కలిగి ఉన్నారని దత్తాత్రేయ వెల్లడించారు. ప్రధానమంత్రిగా ప్రపంచం ముందు భారతదేశాన్ని కొత్త శక్తిగా నిలబెట్టారని పేర్కొన్నారు. సుపరిపాలనకు ఉదాహరణగా నిలిచిన వ్యక్తి అని అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా "మంచి పాలనా దినోత్సవం" గా జరుపుకుంటారని తెలిపారు. రాబోయే తరాలు ఆయన ఆలోచనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇదీ చదవండి: 'భాజపాను అడ్డుకుంటే ఒక్క మంత్రీ గడపదాటలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.