ETV Bharat / state

DATA చోరీ కేసు.. వినయ్‌ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం - డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు

Data Theft Case Latest updates: డేటా చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 66.9 కోట్ల మంది డేటాను అమ్మకానికి పెట్టినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు, యూపీఐ, ఓటీటీ, బ్యాంకు, జీఎస్టీ, ఆర్టీఓ వినియోగదారుల డేటాతో పాటు.. బైజూస్, వేదాంతు వంటి ఆన్​లైన్ లెర్నింగ్ వెబ్​సైట్ల నుంచి విద్యార్థుల డేటాను సేకరించి అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. ఇప్పటికే 16.8కోట్ల మంది డేటా లీకైందని గుర్తించిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా పెద్దఎత్తున వ్యక్తుల రహస్య వివరాలు లీకైనట్లు తేల్చారు.

data
data
author img

By

Published : Apr 1, 2023, 5:57 PM IST

Updated : Apr 1, 2023, 8:14 PM IST

Data Theft Case Latest updates: మీరు ఓటీటీలో సినిమా చూడాలని అనుకుంటున్నారా? దానికోసం డబ్బులు కట్టి మీ వ్యక్తిగత డేటా సదరు ఓటీటీకి ఇచ్చారా? అయితే జాగ్రత్త. మీ డేటా మార్కెట్​లో పెట్టినట్లే. కొంతమంది నేరస్థులు ఆ డేటాను తీసుకొని మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో పాటు.. సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాల బాగోతం బయటపడుతోంది. పది రోజుల క్రితం ఓ ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. 16.8 కోట్ల మంది డేటాను పలు ఏజెన్సీలకు విక్రయించినట్లు తేలింది.

నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు హరియాణా ఫరీదాబాద్​కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఏకంగా 66.9 కోట్ల మంది డేటాను అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన అధికారులే విస్తుపోయారు. ఇన్‌స్పైర్‌వెబ్ పేరుతో వెబ్​సైట్​ను ఏర్పాటు చేసిన వినయ్.. పలు మార్గాల్లో సేకరించిన డేటాను విక్రయానికి పెట్టాడు.

నిందితుడు వినయ్ భరద్వాజ్
నిందితుడు వినయ్ భరద్వాజ్

24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్‌ సిటీల నుంచి డేటా చోరీ: 24 రాష్ట్రాలతో పాటు.. 8 మెట్రోపాలిటన్ సిటీలకు చెందిన వ్యక్తుల డేటా వినయ్ భరద్వాజ్ వెబ్‌సైట్​లో ఉన్నట్లు గుర్తించారు. పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, చిరునామా వంటి వివరాలను సేకరించిన నిందితుడు వాటిని అవసరమైన వాళ్లకు విక్రయిస్తున్నాడు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో పాటు సైబర్ నేరగాళ్లు ఈ వివరాలను తీసుకొని ఉపయోగించుకుంటున్నారు. గంపగుత్త సందేశాలు పంపి ప్రకటనలు ఇస్తున్నవాళ్లు కొంతమంది కాగా.. పలు మోసాలకు సంబంధించిన మెసెజ్​లు చేస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బులు లాగేస్తున్నారు.

వివిధ మార్గాల్లో వివరాల సేకరణ: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వివరాలతో పాటు.. విద్యార్థుల డేటాను వినయ్ భరద్వాజ్ సేకరించాడు. జీఎస్టీ, ఆర్టీఓ, అమెజాన్, నెట్​ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్​పే, బిగ్ బాస్కెట్, బుక్​మైషో, ఇన్​స్టాగ్రామ్, పాలసీబజార్, అప్​స్టాక్స్ సంస్థలకు చెందిన వినియోగదారుల డేటాను తీసుకున్నాడు. బైజూస్, వేదాంతు వంటి ఆన్​లైన్ శిక్షణా సంస్థలకు చెందిన విద్యార్థుల వివరాలను సైతం సేకరించాడు.

ఇందులో రక్షణ రంగానికి చెందిన అధికారుల వివరాలు సైతం అందులో ఉన్నాయి. దిల్లీలోని విద్యుత్ వినియోగదారుల సమాచారాన్ని సేకరించాడు. డీమ్యాట్ ఖాతాదారుల వివరాలు, నీట్ విద్యార్థులు, బీమా పాలసీదారుల వివరాలు,.. క్రెడిట్, డెబిట్ కార్డు, పాన్‌కార్డు దారుల వివరాలను వినయ్ భరద్వాజ్ వివిధ మార్గాల్లో సేకరించినట్లు తేలింది. గుజరాత్​కు చెందిన 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సైతం వినయ్ వెబ్​సైట్​లో దర్శనమిచ్చాయి.

వ్యక్తిగత వివరాల విక్రయం: బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలకు వినియోగదారులు సమర్పించిన వివరాలను.. వినయ్ భరద్వాజ్ సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డాక్టర్లు, సాఫ్ట్​వేర్ ఇంజనీర్లతో పాటు.. 1.8 లక్షల క్యాబ్ ఓనర్ల డేటాను విక్రయానికి పెట్టాడు. నిరుద్యోగులు, విద్యార్ధులు, టీచర్లు, అడ్వకేట్లు, ఆర్కిటెక్చర్, బ్యూటీపార్లర్, కంపెనీల ఎండీలు, కన్సల్టెంట్ల వారు ఉన్నారు. ఫార్మారంగానికి చెందిన వాళ్ల వివరాలు, స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగం, ట్రావెల్స్ సంస్థలకు చెందిన వినియోగదారులను.. పలు విభాగాలు విభజించి వ్యక్తిగత వివరాలు విక్రయానికి పెట్టాడు.

66.9 కోట్ల మంది డేటా: ఇందులో హైదరాబాద్​కు చెందిన 56 లక్షల మంది, ఏపీకి చెందిన 2.1 కోట్ల మంది ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్​కు చెందిన 21.39 కోట్ల మంది డేటా ఉన్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దిల్లీకి చెందిన 2.7 కోట్ల మంది, కేరళ 1.5 కోట్లు, మహారాష్ట్ర 4.5 కోట్లు, పంజాబ్‌కు చెందిన 1.5 కోట్ల మంది.. ఇలా 24 రాష్ట్రాలకు చెందిన 66.9 కోట్ల మంది డేటా వినయ్ వద్ద గుర్తించారు. నిందితుడికి మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వినయ్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: Data Theft Case: వ్యక్తిగత డేటా ఎవరెవరికి విక్రయించారు..?

అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

ప్రేమ వివాహం ఎంత పని చేసింది.. విడదీశారని యువకుడి ఆత్మహత్య

నేవీ చీఫ్​కు​ కొవిడ్ పాజిటివ్​​.. ఆ ప్రోగ్రాం క్యాన్సిల్.. హఠాత్తుగా దిల్లీకి తిరుగు పయనం

Last Updated : Apr 1, 2023, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.