ETV Bharat / state

YS Viveka Murder Case : ఎంత డబ్బు కావాలో చెప్పు.. దస్తగిరికి బంపర్‌ ఆఫర్‌ - వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం

YS Viveka Murder Case : ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇవాళ వెలుగులోకి వచ్చాయి.

YS Viveka Murder Case
YS Viveka Murder Case
author img

By

Published : Feb 22, 2022, 6:16 PM IST

YS Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై దస్తగిరి... సీబీఐకి ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చాడు.

'తన వాంగ్మూలం నమోదు తర్వాత భరత్ యాదవ్ కలిశాడు. అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్‌ యాదవ్‌ అడిగాడు. నేను ఉండే ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్‌, న్యాయవాది వచ్చారు. భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పంపించారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామన్నారని చెప్పారు. ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారు. భరత్‌ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడు' అని దస్తగిరి తన స్టేట్​మెంట్​లో పేర్కొన్నాడు.

వాంగ్మూలం నమోదు...

మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో (ఏ-4) నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరిని.. సీబీఐ అధికారులు సోమవారం.. కడప జిల్లా పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అప్రూవర్​గా మారిన అతని చేత.. మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు. గతేడాది నవంబరు 26న అప్రూవర్‌గా మారేందుకు.. దస్తగిరికి కడప కోర్టు అనుమతివ్వగా.. ఆగస్టు 31న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.

వివేకా హత్య కేసు బదిలీ..

YS Viveka Murder Case transfer: మరోవైపు వైఎస్‌ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్‌ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్‌, వాయిదా, బెయిల్‌ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.

నిందితుల రిమాండ్ పొడిగింపు..

అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి : Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ.. కడప జిల్లా కోర్టుకు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.