హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చిత్ర లేఔట్ కాలనీలో వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కాలనీ వాసులు కోలాటాలు, నృత్యాలతో పిల్లలు, యువతి యువకులు, మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో హుషారుగా పాల్గొన్నారు. వివిధ రకాల పాటలకు కోలాటాలతో నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని కల్పించారు. ఏటా ఇలాంటి కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటామని కాలనీ అధ్యక్షుడు అంజి రెడ్డి తెలిపారు. పండుగ వచ్చిందంటే చాలు కాలనీవాసులు అంతా ఒకే కుటుంబంలా కలిసి మెలసి ఉంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : '2020 మార్చి నాటికి 300 విద్యుత్ బస్సులు'