హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఓ స్థలాన్ని వేలం ద్వారా విక్రయించిన బ్యాంకు తరపున కంచె వేయించేందుకు ప్రయత్నించిన ఉద్యోగితో.... ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహరించిన తీరు చర్చనీయాశమైంది. ఖైరతాబాద్‌లో సాజిద అనే మహిళకు చెందిన 2050 గజాల భూమిని 1950లో కావూరి సాంబసివరావుకు చెందిన..... ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ. లక్షన్నరకు కొనుగోలు చేసింది. ఇందుకు చిక్కడపల్లిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రుణం తీసుకుంది. అయితే ఆ రుణాన్ని చెల్లించనందున రోడ్డు విస్తరణలో పోగా మిగిలిన 1500 గజాల స్థలాన్ని బ్యాంకు వేలం వేసింది.
ఈ వేలంలో నోబెల్ రియల్టర్స్.. ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ మేరకు స్థలాన్ని కొనుగోలుదారుకు అప్పగించే క్రమంలో బ్యాంకు సిబ్బంది కంచె వేయించేందుకు అక్కడకు వెళ్లారు. ఇది తెలిసి అక్కడకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్.. గతంలో అక్కడ పాఠశాల ఉండేదని, ఆ స్థలాన్ని ఎలా అమ్ముతారని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే దానం అనుచరులు బ్యాంకు ఉద్యోగిని నెట్టేస్తున్న వీడియో ఇప్పుడు దుమారు రేపుతోంది. ఈ ఘటనతో బ్యాంకు ఉద్యోగులు ఆ స్థలానికి భద్రత కల్పించాలని సైఫాబాద్ పోలీసులను కోరారు. ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలపారు
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసు
లు