ETV Bharat / state

ఇళ్లల్లో ఖాళీ కడుపులు..అడ్డాల్లో పడిగాపులు!

తెల్లవారగానే సద్దిమూట పట్టుకుని రావడం.. ఎండ నడినెత్తిని చేరేదాకా పనికోసం పడిగాపులు కాయడం.. ఇక సమయం మించిపోతే ఆరోజుకి ఆశలు చంపుకుని వెంట తెచ్చుకున్న సద్దిడబ్బా అక్కడే తినేసి గదులకు, అద్దెకుంటున్న లాడ్జీలకు పయనమవడం.. రేపయినా పని దొరకాలి దేవుడా అంటూ విశ్రమించడం.. మళ్లీ తెల్లవారగానే యథాతథం..! ఇదీ నగరంలో ఒకప్పుడు అడ్డాకూలీల పరిస్థితి.

corona effect on daily workers
corona effect on daily workers
author img

By

Published : May 5, 2020, 8:40 AM IST

కరోనా దెబ్బతో అంతా అతలాకుతలమైంది. అన్నీ మారిపోయాయి. కానీ అడ్డాకూలీల దినచర్యల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈసారి వీళ్ల ఎదురుచూపులు పనికోసం కాదు ఆకలి తీర్చే దాతల కోసం. పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది తెలుగు రాష్ట్రాల వలస కూలీలకు. లాక్‌డౌన్‌ కాలంలో ఇక్కట్లు పడుతున్న వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో తెలుగు కూలీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరాన్ని నమ్ముకుని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కూలీలు.

తక్కువ ఖర్చు...

నగరంలో దాదాపు 200 దాకా కూలీల అడ్డాలున్నట్లు అంచనా. వీటిలో ప్రతిరోజూ 200కుపైగా కూలీలు జమయ్యే పెద్ద అడ్డాలు బోరబండ, నాంపల్లి, ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్‌, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఉండగా.. ఎక్కువ అడ్డాలు పాతబస్తీలోనే ఉన్నాయి. పేద లేబర్లకు తక్కువ ఖర్చులతో ఆశ్రయమిచ్చే ప్రాంతాలిక్కడ ఉండటమే అందుకు కారణం. ఇక్కడున్న చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, డబీర్‌పుర, యాకుత్‌పుర, బహదూర్‌పుర, కిషన్‌బాగ్‌, ఫలక్‌నుమా, ఎర్రకుంట, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40 శాతం ఉండగా.. మిగతా 60 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి నగరాన్ని నమ్ముకొని వచ్చినవారే.

మేమూ వలస కూలీలమే’...

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం చుట్టుపక్కల గ్రామాల నుంచి కుటుంబాలతో నగరానికి పదేళ్ల క్రితం వలస వచ్చారు. యూసుఫ్‌గూడ పరిధిలో జవహర్‌నగర్‌ బస్తీలో ఉంటున్నారు. ఈ బస్తీలోనే దాదాపు 2 వేల మంది ఉంటున్నారు. వీరిలో ఏఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ సాయమందలేదని చెబుతున్నారు. సర్కారు కేవలం ఇతర రాష్ట్రాల కూలీలనే గుర్తించి నగదు, బియ్యం అందజేసిందని, తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ తిండి కోసం ఇలా అడ్డామీదికొచ్చి ఉంటున్నామంటున్నారు. ఎవరైనా దాతలు ఇచ్చే ఆహార పొట్లాలే ఆధారమని చెప్పుకొస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.