మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనంపైన ఉన్న గోదాము కప్పు, గోడలు కూలిపోయాయి. గోదాంలోనే పనిచేస్తూ అక్కడే నివసించే రాజు... పేలుడు కారణంగా గుర్తు పట్టడానికి వీలు లేకుండా కాలిపోయాడు.
గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ప్రమాదం జరిగిందా? అగ్నిమాపక పరికరాలు నిల్వ ఉంచే గోదాంలో మిశ్రమం ఫిల్లింగ్ చేసే క్రమంలో పేలుడు జరిగిందా అనే కోణంలోనూ అగ్నిమాపకశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలంలో అగ్నిప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు ఏసీ, ఫ్రిజ్, గ్యాస్ సిలిండర్ వంటివి వాడే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం సమాచారం ఇవ్వడం ద్వారా నష్టం కొంత వరకు తగ్గించుకోవచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి:బ్యాట్స్మెన్ విఫలమాయె.. సిరీస్ పోయె