ETV Bharat / state

మాండౌస్‌ తుపాను.. దక్షిణ కోస్తా, రాయలసీమ అతలాకుతలం - ఏపీలో మాండౌస్ తుపాన్ ఎఫెక్ట్ తాజా వార్తలు

Cyclone Mandous: తీవ్ర తుపానుగా మారిన మాండౌస్‌.. దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం చూపిస్తోంది. ఏపీలోని నెల్లూరు, బాపట్ల, తిరుపతి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను తీవ్రతను అంచనా వేస్తున్నారు.

Cyclone Mandous
Cyclone Mandous
author img

By

Published : Dec 10, 2022, 7:16 AM IST

Cyclone Mandous: మాండౌస్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మైపాడు తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 50 మీటర్లకు పైగా ముందుకురావడంతో.. అలలు బీచ్ వద్ద దుకాణాలను తాకుతున్నాయి. పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాల అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు.

తుపాను ప్రభావంతో రైతుల్లో ఆందోళన: తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న షల్టర్‌లలో వసతులు ఏర్పాటు చేశారు. జిల్లాకు ఒక ఎస్​డీఆర్​ఎఫ్, రెండు ఎన్డీఆర్​ఎఫ్​ ​బృందాలు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా సోమశిల జలాశయం నుంచి.. పెన్నా నదిలోకి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తీర ప్రాంతంలోని 11మండలాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో అల్లూరి జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాల కారణంగా ధాన్యం పాడవుతుందని రైతులు దిగులు చెందుతున్నారు.

కడపలో సాయంత్రం అయిదు గంటల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తుపాను దృష్ట్యా.. చెరువులు, కాలువల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మాండౌస్ తుపాను తిరుమలలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండపై చలి తీవ్రత అధికంగా ఉండటంతో వృద్దులు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. తుపాను మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని.. ఆ సమయంలో 65నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

ఇవీ చదవండి: Telangana Cabinet Meeting : నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి..​ 'హిమాచల్​ సీఎం' విషయంలో హైకమాండ్​దే ఫైనల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.