ETV Bharat / state

భాగ్యనగరంలో వచ్చేస్తున్నాయ్​... సైకిల్​ ట్రాక్​లు - cycling tracks

హైదరాబాద్​లో సైకిల్​ ట్రాక్​లను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, హెచ్​ఎంటీఏ కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సైకిల్‌ ఫర్‌ ఛేంజ్‌’ ఛాలెండ్​కు మన రాష్ట్రం నుంచి హైదరాబాద్​, వరంగల్​, కరీంనగర్​ ఎంపికయ్యాయి. నగరంలోని ఖైరతాబాద్​లో ప్రయోగాత్మకంగా 20కి.మీలు ట్రాక్​ను అందుబాటులోకి తేనున్నారు.

cycle tracks in hyderabad
భాగ్యనగరంలో వచ్చేస్తున్నాయ్​... సైకిల్​ ట్రాక్​లు
author img

By

Published : Sep 5, 2020, 8:04 AM IST

రానున్న రెండు, మూడేళ్లలో దశలవారీగా నగరంలో 450 కి.మీ. మేర సైకిల్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(హెచ్‌ఎంటీఏ) కసరత్తు చేస్తున్నాయి. ఖైరతాబాద్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్, కోకాపేట తదితర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సైకిల్‌ ఫర్‌ ఛేంజ్‌’ ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు ఎంపికయ్యాయి. మన రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు చోటు దక్కింది. ఈ ఛాలెంజ్‌ రెండు దశల్లో అమలవుతోంది. మొదటి దశలో సైకిల్‌ ట్రాక్‌లను ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై సర్వే చేపడతారు. రెండో దాంట్లో ప్రచారం, సైక్లింగ్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

ఇందుకు ఈ ఏడాది అక్టోబర్‌ 14 వరకు గడువుగా నిర్ణయించింది. వీటి అమలును పర్యవేక్షించిన అనంతరం 95 నగరాల్లో పదకొండింటిని ఎంపిక చేస్తుంది. ఆ జాబితాను అక్టోబర్‌ 28న ప్రకటిస్తుంది. అలా ఎంపికైన నగరాలకు కేంద్రం రూ.కోటి చొప్పున అందజేస్తుంది. అలాగే సైక్లింగ్‌ ట్రాక్‌ల అభివృద్ధిపై నిపుణుల సలహాలు, సూచనలిస్తారు.

ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంటీఏ ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్‌ (సెంట్రల్‌ జోన్‌)లో ఏడు సైక్లింగ్‌ ట్రాక్‌ (ఒక్కొక్కటి 23 కి.మీలు)లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. తొలుత రోడ్డుకు ఇరువైపులా 10 కి.మీల చొప్పున (మొత్తం 20 కి.మీ.లు) అందుబాటులోకి తేనున్నారు. ఆ తర్వాత నగరవాసుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం మిగిలిన వాటిని అభివృద్ధి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: గురుపూజోత్సవం: పాఠమే ప్రాణం.. బడితోనే బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.