తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్కులు, శానిటైజర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ఇతరత్రా అవసరమైన పరికరాలు అందజేసేందుకు సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. పలు ఐటీ సంస్థలతో కలిసి సెక్యురిటీ కౌన్సిల్ చేపడుతున్న కార్యక్రమాన్ని సజ్జనార్ అభినందించారు.