ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల (drugs news) నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి (CM KCR) విస్పష్ట ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబరాబాద్, రాచకొండ పోలీసులు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్, గంజాయి విక్రేతలు (ganja smuggling), సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు. గంజాయి విక్రయిస్తే ఎన్డీపీఎస్ చట్టం (NDPS ACT) కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు. వరుస దాడులు నిర్వహిస్తూ... పెద్ద ఎత్తున గంజాయి, మత్తుపదార్థాలు పట్టుకుంటున్నారు. అయితే.. వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారు..? ఎవరికి విక్రయిస్తున్నారు..? అన్నది మాత్రం ఎప్పటికీ ‘మిస్టరీ’గానే మిగిలిపోతోంది. ఇటీవల పట్టుబడిన దాదాపు అన్ని కేసుల్లోనూ (ganja case news) ఇదే పరిస్థితి. అసలు సూత్రధారులు చిక్కకపోవడమే ఇందుకు కారణం.
నాచారం ‘ఫిరోజ్’ ఎక్కడ..?
రాచకొండ పోలీసులు సోమవారం రోజు (ganja news today) బోడుప్పల్‌లోని ఓ ఆటో గ్యారేజ్‌లో 1,240 కిలోల గంజాయిని స్వాధీనం (ganja case news) చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీలోని సీలేరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు పట్టుబడిన ముగ్గురు నిందితులు పేర్కొన్నారు. వీరి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టలేకపోయారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి నాచారానికి చెందిన షేక్ యాసీన్ అలియాస్ ఫిరోజ్(32) చిక్కితేనే అసలు విషయం వెలుగుచూసేది.
‘భాయ్’ ఎవరు..?
ఈ నెల 12న మాదాపూర్‌లో మహమ్మద్ బీన్ హాస్సాన్ కొలనీ అలియాస్ మాలిక్ సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) అదుపులోకి తీసుకున్నారు. 3 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం (ganja smuggling) చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో యాసిన్‌ఖాన్, ఇఫ్యేకర్ అహ్మద్, రహేద్ అలీని 16న హైటెక్‌సిటీ (Hi tech city) రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. 42 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీరికి ముంబయికి చెందిన ‘భాయ్’ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతనెవరో తేలలేదు.
యువత భవిష్యత్ కోసం అవగాహన కార్యక్రమాలు...
మరోవైపు మాదకద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. మత్తు విక్రయాల గురించి తెలిస్తే 949061711కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచటంతో పాటు పోలీసుశాఖ తరఫున నజరానాలు సైతం అందించనున్నట్లు ప్రకటించారు.
- ఇదీ చదవండి: ఆన్లైన్లో గంజాయి సరఫరాపై ప్రధానికి సీఏఐటీ లేఖ