ETV Bharat / state

డ్రైవర్​ మత్తులో ఉన్నాడని తెలిసీ వాహనంలో వెళ్తే.. - telangana varthalu

మీరు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా....! ఆ విషయం తెలిసినా మీరు అదే వాహనంలో వెళ్తున్నారా....! అయితే జాగ్రత్త....! అలా చేస్తే ప్రయాణికులపై కూడా కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. డ్రైవర్ మద్యం సేవించాడని తెలిసినా.. వాహనంలో ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

డ్రైవర్​ మత్తులో ఉన్నాడని తెలిసీ వాహనంలో వెళ్తే..

author img

By

Published : Mar 12, 2021, 3:51 AM IST

Updated : Mar 12, 2021, 4:45 AM IST

డ్రైవర్​ మత్తులో ఉన్నాడని తెలిసీ వాహనంలో వెళ్తే..

రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న సైబరాబాద్‌ పోలీసులు.. ఇక నుంచి ఆ వాహనంలో కూర్చున్న వారి మీద కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 188ని ప్రయోగిస్తున్నారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి ఏమాత్రం పట్టించుకోకుండా అదే వాహనంలో కూర్చొని ప్రయాణిస్తే చట్టరీత్యా నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

డ్రైవర్​ స్థితిగతులను తెలుసుకోవాలి..

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. మోతాదుకు మించి సేవించటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరహా ప్రమాదాలు నివారించడానికి పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకొని... ఒకట్రెండు రోజుల తర్వాత డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే... వారుపడే యాతన వంటివి దృశ్య మాధ్యమం ద్వారా ట్రాఫిక్ చూపిస్తున్నారు. అనంతరం వాహనదారులపై నేరాభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఇక ప్రయాణికులపైనా కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తుండటంతో.. డ్రైవర్ స్థితిగతులను తెలుసుకొని వాహనంలో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది.

వాహనదారుల్లో మార్పు రాకపోవటం వల్లే..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది 625 ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఇందులో 663 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 20 శాతంకు పైగా ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగాయి. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 47లక్షల 83వేల వాహనాలపై కేసులు నమోదు చేసి 178 కోట్ల జరిమానా విధించారు. వందల మంది వాహనదారుల లైసెన్సులు తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దవుతున్నాయి. అయినా వాహనదారుల్లో మార్పు రాకపోవటం వల్ల మోటారు వాహనాల చట్టం 1988లోని 188 వ సెక్షన్‌ను ప్రయోగించనున్నారు. డ్రైవర్ మద్యం సేవించిన విషయం తెలిసి వాహనంలో ప్రయాణించే వాళ్లపైనా కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వాహనదారులకు తెలియజేస్తున్నారు.

ప్రజల క్షేమం కోసమే..

రహదారి ప్రమాదాల నివారణకు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు... ప్రజల క్షేమం కోసమేనని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: డ్రైవర్‌ తాగి ఉన్నాడని తెలిసీ వాహనంలో ప్రయాణిస్తే కేసు తప్పదు

Last Updated : Mar 12, 2021, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.