ETV Bharat / state

పెట్రోల్​ బంకుల్లో మోసాలు.. గుట్టువిప్పిన పోలీసులు - సెబారాబాద్​ పోలీసుల తాజా వార్తలు

తెలంగాణలోని 9 పెట్రోల్​ బంక్​ యజమానులను సైబారాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ బంక్​ యంత్రాల్లో చిప్​లు ఏర్పాటు చేసి మోసాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. చిప్​ల ద్వారా లీటర్​కు 30 మిల్లీ లీటర్ల పెట్రోల్​ తక్కువగా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో 11, ఏపీలో 22 పెట్రలో బంక్​లు సీజ్​ చేసినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు.

పెట్రోల్​ బంక్​ యంత్రాల్లో చిప్​లు ఏర్పాటు చేసి మోసం

author img

By

Published : Sep 5, 2020, 4:17 PM IST

Updated : Sep 5, 2020, 4:41 PM IST

పెట్రోల్‌ బంక్​ యంత్రాల్లో చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు ముఠా సభ్యులతో పాటు.. రాష్ట్రంలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది పెట్రోల్‌ బంక్‌ల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో 11, ఏపీలో 22 పెట్రోల్‌ బంక్‌లను సీజ్‌ చేశారు. చిప్‌ల ద్వారా లీటర్‌కు 30 మిల్లీ లీటర్ల పెట్రోల్‌ తక్కువగా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో కీలక సభ్యుడు సుభాని బాషా.. బంకు యంత్రాల్లో ఆరితేరి.. చిప్‌లు రూపొందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయిల్‌ కార్పొరేషన్, పోలీసుల తనిఖీల్లోనూ దొరకకుండా జాగ్రత్తాలు పాటిస్తున్నారని సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.

14 చిప్‌లు, 8 డిస్‌ప్లే బోర్డులు, మదర్ బోర్డు, కారు స్వాధీనం చేసుకున్నాం. చిప్‌లు అమర్చడంలో సుభాని బాషా ప్రధాన నిందితుడు. ముంబయికి చెందిన వారితో జతకట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిప్స్ తయారు చేశారు. పెట్రోల్ పోసే బాక్సులలో ఈ చిప్స్ అమర్చి మోసం చేసేవారు. డిస్​ప్లేలో ఒక చిప్​ను, లోపల మరో చిప్​ను సెట్ చేసి ప్రజలను మోసం చేసేవారు. ఒక్క చిప్​ను పెట్టినందుకు ఒక్కో బంక్​ యాజమానుల దగ్గర నుంచి రూ. 80 వేల నుంచి లక్షా 20 వేల వరకు తీసుకునేవారు. ప్రభుత్వ అధికారులు చెకింగ్​కు వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేస్తే తిరిగి ఒరిజినల్ సిస్టంకు వెళ్లిపోతుంది. ఈవిధంగా సెట్ చేసి దొరక్కుండా ఉండేవారు. బంక్​లలో రెండు పంపులు ఉంటాయి కదా.. క్యాన్, బాటిల్స్​లలో పోసేటప్పుడు ఒరిజినల్ పంపులో నుంచి పెట్రోల్​ పోసేవారు.

-సజ్జనార్​ సైబారాబాద్​ సీపీ

పెట్రోల్​ బంకుల్లో మోసాలు.. గుట్టువిప్పిన పోలీసులు

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

Last Updated : Sep 5, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.