ETV Bharat / state

స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెడతామంటూ మోసం

స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెడతామంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్​లోని భోపాల్​కు చెందిన 'ద టాప్ గ్లోబల్ కంపెనీ' నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్​లో లాభాలు వస్తాయని నిందితులు నమ్మించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెడతామంటూ మోసం
స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెడతామంటూ మోసం
author img

By

Published : Sep 14, 2020, 5:00 AM IST

స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెడతామంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చిలో వనస్థలిపురానికి చెందిన సుధాకర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మధ్యప్రదేశ్​లోని భోపాల్​కు చెందిన 'ద టాప్ గ్లోబల్ కంపెనీ' నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్​లో లాభాలు వస్తాయని నిందితులు నమ్మించినట్లు సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్ కూడా నిందితులకు చెప్పడం వల్ల తన ఖాతా నుంచి రూ. 9 లక్షల 60 వేలు కాజేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్​లోని సాగర్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి.. స్థానిక న్యాయస్థానంలో హాజరుపర్చారు. పీటీ వారెంట్​పై హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: కాలిఫోర్నియాలోని బాలికకు వేధింపులు.. యువకుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.