ETV Bharat / state

పెట్రోల్​ బంక్​ యజమానుల 'చీప్'​ దందా.. రాష్ట్రంలో 9 మంది అరెస్టు - సైబరాబాద్​ పోలీసుల తాజా వార్తలు

మీటరు మీద లీటరే... కానీ ట్యాంకులో పడేది అంతకు తక్కువే. కొలతల్లో మోసాలతో పెట్రోలు బంకులు.. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. చిన్న చిప్‌తో పెట్రోలు నొక్కేస్తున్నాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ దందాను చేధించిన సైబరాబాద్‌ పోలీసులు... తెలుగు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్న బంకుల యజమానులతో పాటు సాంకేతికతను అందిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. తెలంగాణలో 11, ఏపీలో 22 బంకులను సీజ్‌ చేశారు.

పెట్రోల్​ బంక్​ యజమానుల 'చీప్'​ దందా.. రాష్ట్రంలో 9 మంది అరెస్టు

author img

By

Published : Sep 5, 2020, 8:47 PM IST

పెట్రోల్​ బంక్​ యజమానుల 'చీప్'​ దందా.. రాష్ట్రంలో 9 మంది అరెస్టు

పెట్రోలు బంకుల్లో మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. మనకు కనిపించే మీటరులో రీడింగ్‌ సరిగ్గానే చూపిస్తున్నా.. ట్యాంకులోకి చేరేది మాత్రం తక్కువే. చిన్నపాటి చిప్‌లతో పెట్రోలు బంకుల యజమానులు జనాలకు టోపీ పెడుతున్నారు. కొన్ని ముఠాల సాయంతో పెట్రోలు పోసే యంత్రాల్లో చిన్నపాటి చిప్‌లను అమరుస్తున్న బంకులు.. వినియోగదారుల నుంచి గప్‌చుప్‌గా దోచుకుంటున్నాయి. లీటర్‌ పెట్రోలు లోంచి 30 మిల్లీ లీటర్ల వరకు నొక్కేస్తున్నాయి. సాంకేతికతను అందించే అంతర్రాష్ట్ర ముఠాలతో కలసి పెట్రోలు బంకుల యజమాన్యాలు.. గుట్టుచప్పుడు కాకుండా ఈ మోసాలు సాగిస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఆయిల్‌ కార్పోరేషన్‌ చర్యలు చేపడుతున్నా.. సరికొత్త సాంకేతికతతో బంకుల దోపిడీకి ఈ ముఠాలు తోడ్పడుతున్నాయి.

సాంకేతికతను ఉపయోగించుకుని..

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మోసాలకు తెరలేపేలా బంకు యజమానులకు సహకరిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నందిగామలో చిప్‌ అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నామన్న పోలీసులు... ముంబై నుంచి వీటిని తెప్పించి తెలుగు రాష్ట్రాల్లోని బంకుల్లో అమరుస్తున్నారని వెల్లడించారు. ఒక్కో చిప్‌కు రూ. 80 వేల నుంచి లక్షా ఇరవై వేల వరకు బంకు యజమానుల వద్ద వసూలు చేసేవారని తెలిపారు. ఈ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు ఏపీ ఏలూరుకు చెందిన సుభాని అలియాస్‌ బాషా అని చెప్పిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌... తన బంధువుల్లోని మరో ముగ్గురిని కలుపుకుని మోసాలకు తెరలేపాడని వెల్లడించారు.

cyberabad police arrest interstate petrol bunk cheaters
పట్టుబడిన పెట్రోల్​ బంక్​ మోసగాళ్లు

టెక్నికల్​ బృందాలు ఏర్పాటు చేయాలి:

నిందితులిచ్చిన సమాచారంతో రాష్ట్రంలోని బంకుల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు... ఏపీ అధికారులకూ సమాచారం అందించారు. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన తనిఖీల్లో... తెలంగాణలో 11, ఏపీలో 22 బంకులను సీజ్‌ చేశారు. రాష్ట్రంలో 9 మంది, ఏపీలో 19 మంది బంక్‌ యజమానులను అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌తో పాటు, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, భువనగిరి, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో పెట్రోల్‌ బంకులను అధికారులు సీజ్‌ చేశారు. ప్రజలతో పాటు ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారులనూ బురిడీ కొట్టించేలా అక్రమార్కులు జాగ్రత్తలు వహిస్తున్నారన్న పోలీసులు... కార్పొరేషన్లు, టెక్నికల్ బృందాలను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ప్రధాన చిప్‌ సప్లయర్లతో పాటు ఐదుగురు బంక్‌ యజమానులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.