Cyberabad Commissioner orders Investigation on KPHB Police : కేసు విచారణ పేరుతో పిలిచి ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్‌కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదం రావటంతో శ్రీలక్ష్మి, ప్రణీత్‌పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్లో(Disha Police Station) కేసు పెట్టి, అతడికి దూరంగా ఉంటోంది.
ఇదేం తీరు పోలీసన్నా - రక్షించాల్సిన మీరే రాంగ్ రూట్లోకి వెళితే ఎలాగన్నా?
Man Complaint on KPHB Police in Cyberabad Station : ప్రణీత్ హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం శ్రీలక్ష్మి తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తూ తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని, తనకి న్యాయం చేయాలంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో(Nallapadu Police Station)ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలక్ష్మి, తన భర్త నిజాంపేట రోడ్డులో నివసిస్తూ ఉండటంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Couples Complaint Case in KPHB Police Station : విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించిన కేపీహెచ్‌బీ పోలీసులకు, తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపాడు. అయినా శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలంటూ పోలీసులు అతడిని దూషిస్తూ, విచక్షణారహితంగా చితకబాదారని, దీంతో తనకు తీవ్రగాయాలయ్యాయని బాధితుడు తెలిపాడు. తనపై అకారణంగా దాడికి పాల్పడిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రణీత్ సామాజిక మాధ్యమం(Social Media) ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశాడు.
'నాకు 2018లో శ్రీలక్ష్మీతో వివాహం జరిగింది. కొన్నేళ్ల క్రితం మా ఇద్దరి మధ్య వివాదాలు అయ్యి విడిపోయాం. అప్పుడే నాపై తను గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వేర్వేరు పోలీస్ స్టేషన్లో కూడా నాపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో తన సర్టిఫికెట్లు నా దగ్గరే ఉన్నాయంటూ ఫిర్యాదు చేసింది. దీంతో కేపీహెచ్‌బీ పోలీసులు నన్ను స్టేష్‌న్‌కు పిలిపించారు. గత కేసులకు సంబంధించిన ఫైళ్లను పోలీసులకు ఇచ్చాను. అయినప్పటికీ సీఐ క్యాబిన్లో నన్ను, నలుగురు పోలీసులు కలిసి కొట్టారు.' - ప్రణీత్ , బాధితుడు
ప్రణీత్ విజ్ఞప్తిని పరిశీలించిన కమిషనర్ కేపీహెచ్‌బీ పోలీసులపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించ లేదు.
భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది : సైబరాబాద్ సీపీ