ETV Bharat / state

Cyber frauds in Hyderabad : కామెంట్లు కావాలన్నారు.. కట్​ చేస్తే.. రూ. 1.10కోట్లు కొట్టేశారు - Cyber frauds in Hyderabad

Cyber frauds in telanagana : సోషల్ మీడియా వినియోగం పెరగటంతో అదే స్థాయిలో సైబర్‌ నేరాలూ పెరిగిపోతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని సైబర్​ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లోని ఓ సాప్ట్​వేర్​ ఉద్యోగినికి వల వేసిన కేటుగాళ్లు.. ఇన్​స్టాగ్రామ్​ పోస్టులకు కామెంట్లు కావాలంటూ రూ. 1.10 కోట్లు కొట్టేశారు. దీంతో బాధిత మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

Cyber fraud
Cyber fraud
author img

By

Published : Jun 12, 2023, 10:45 PM IST

Cyber criminals cheated stopware employee in Hyderabad : సైబర్​ నేరగాళ్లపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న రోజుకో కొత్త అవతారంలో అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్​ మీడియాను ఆసరాగా చేసుకొని ఈ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొన్ని లింక్​లు పంపించడం వాటిని ఓపెన్​ చేయడంటూ చెప్పడం.. ఆకర్షణీయ బహుమతులు మీ సొంతం అంటూ ప్రకటన చేయడం ఇలా అనేక పద్ధతిలో సైబర్​ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది.

ఇన్​స్టాగ్రామ్​లో పోస్టులకు కామెంట్లు ఇవ్వాలంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.1.10 కోట్లు కొట్టేశారు. రేటింగ్‌ ఇస్తే రోజూ ఇంట్లో ఉండే సంపాదించవచ్చంటూ ఆమెను బోల్తా కొట్టించారు. పోలీసులు, బాధితురాలు కథనం ప్రకారం.. నగరంలోని పీరంచెరువు ప్రాంతంలో నివాసముండే సాప్ట్​వేర్​ ఉద్యోగినికి ఇటీవల టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. తమ రిక్రూట్‌మెంట్‌ పార్ట్‌నర్‌ ద్వారా మీ ఫోన్‌ నెంబరు తెలిసిందని.. రేటింగ్, రివ్యూలు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చని సందేశంలో ఉంది.

Cyber fraud with social media : సందేశంలో ఓ టెలిగ్రామ్‌ గ్రూప్‌ లింకును కూడా ఉంచారు. దానిని క్లిక్ చేసిన అనంతరం ఆమె టెలిగ్రామ్‌ గ్రూపులో యాడ్‌ అయింది. ఇదే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీకి కామెంట్లు ఇవ్వాలని ఓ వ్యక్తి టెలిగ్రామ్​లో సందేశం పంపాడు. అతను చెప్పినట్లుగా బాధితురాలు కామెంట్లు చేసి స్క్రీన్‌ షాట్లు పంపించింది. తొలి టాస్కు పూర్తవ్వగానే బ్యాంకు ఖాతా వివరాలు పంపితే డబ్బు జమ చేస్తామంటూ మరో వ్యక్తి ఫోన్‌ చేశాడు. కొన్ని టాస్కుల తర్వాత ఆమెను నమ్మించేందుకు కొంత డబ్బు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

ఆ తర్వాత కొత్త టాస్కులు ఇవ్వాలంటే ముందే వెయ్యి రూపాయలను పంపాలని చెప్పగా బాధితురాలు అలాగే చేసింది. ఆ తర్వాత 99వేల 999 పంపాలని సూచించారు. ఇలా టాస్కుల పేరుతో మే 7నుంచి జూన్‌ 8వరకూ విడతల వారీగా ఆమె నుంచి 1.10 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. అన్ని టాస్కులు పూర్తి చేశాక డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినా.. అవకాశం లేకపోవడంతో ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్​ నేరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న కొందరు వారి వలలో పడిపోతున్నారు. ముఖ్యంగా తమకు అన్ని తెలుసు అనుకొని.. బాగా చదువుకున్న వారే ఇలాంటి కేసుల్లో బాధితులుగా ఉండటం గమన్హారం. తెలియని లింక్​లు ఓపెన్​ చేయడం.. తెలియని వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకోవడం ఈ తరహా మోసాలకు దారి తీస్తున్నాయి. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.