ETV Bharat / state

సునీల్ కనుగోలుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు.. ఈ నెల 30న విచారణ! - 41ఏ సీఆర్​పీసీ నోటీసులు

41A CRPC notices for Sunil kanugolu: రాష్ట్ర కాంగ్రెస్​ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు రావాలని నోటీసులో వెల్లడించారు. సునీల్​ తరపున నోటీసులను కాంగ్రెస్​ నేత మల్లు రవి అందుకున్నారు.

congress leader mallu ravi
కాంగ్రెస్​ నేత మల్లు రవి
author img

By

Published : Dec 27, 2022, 3:38 PM IST

41A CRPC notices for Sunil kanugolu: ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు 41ఏ సీఆర్​పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు. ఈ నోటీసులను సునీల్​ కనుగోలు తరపున కాంగ్రెస్​ నేత మల్లు రవి తీసుకున్నారు.

అసలేం జరిగింది: ఈనెల 14వ తేదీన సీఎం కేసీఆర్​, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో కాంగ్రెస్​ నేత సునీల్​ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేశారు. ఫేస్‌బుక్‌లో రెండు పేజీలు నిర్వహిస్తున్న ఆయన బృందం.. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై సునీల్‌ కనుగోలు కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు తీసుకున్నారు. దాదాపు 6 గంటలు సోదాలు చేసిన అధికారులు హార్డ్‌డిస్క్‌లు, లాప్‌టాప్‌లు, స్వాధీనం చేసుకున్నారు.

సునీల్​ కనుగోలుకు 41ఏ సీఆర్​పీసీ నోటీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.