బ్యాంకు అధికారులమంటూ సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర కొనసాగుతుంది. హైదరాబాద్ వారసిగూడకి చెందిన సాయి నితిన్‌కి బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ వచ్చింది. కేవైసీ అప్డేట్ చేయాలంటూ తన మొబైల్‌కి వచ్చిన ఓటీపీని సాయి నితిన్ ఆర్థిక చోరగాళ్లకు చెప్పాడు. ఓటీపీ ద్వారా లక్షా అయిదు వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు అధికారులమంటూ ఆన్లైన్లో రూ.లక్ష దోపిడీ
సికింద్రాబాద్ పరిధి వారసిగూడకి చెందిన ఓ యువకుడికి బ్యాంకు అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అనంతరం ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ వచ్చిందని చెప్పి ఓటీపీ ద్వారా లక్షా అయిదు వేల రూపాయలు దోచేశారు.
కేవైసీ అప్డేట్ రూ.లక్ష మోసం