ETV Bharat / state

సైబర్​ గాలం: చేతి తొడుగుల పేరుతో ఓ ఇంజినీర్​కు రూ. 6.50లక్షలు టోకరా - హైదరాబాద్​లోని ఓ ఇంజినీర్​కు సైబర్​గాళం

కరోనా నేపథ్యంలో చేతి తొడుగులు, మాస్కులకు డిమాండ్​ పెరిగిపోయింది. దీనిని అదునుగా చేసుకున్న కొందరు సైబర్​నేరగాళ్లు ఆన్​లైన్​లో తాము ప్రత్యేకమైన గ్లౌజులు అమ్ముతున్నామంటూ ప్రటనల ద్వారా అమాయకపు ప్రజలకు టోకరా వేస్తున్నారు. ఇదే తరహాలోని ఓ ప్రకటన చూసి హైదరాబాద్​ బేగంపేటకు చెందిన ఓ ఇంజినీర్​ సుమారు రూ. ఆరున్నర లక్షలు ఆన్​లైన్​లో పంపి సైబర్​నేరగాళ్ల చేతిలో మోసపోయాడు.

Cyber_Cheaters_Cheating_On_Engineer in hyderabad
సైబర్​ గాలం: చేతి తొడుగుల పేరుతో ఓ ఇంజినీర్​కు రూ. 6.50లక్షలు టోకరా
author img

By

Published : Jul 21, 2020, 2:33 PM IST

చేతి తొడుగులు అమ్ముతానంటూ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఇంజినీర్​కు సైబర్ నేరగాడు రూ. 6.50 లక్షలు టోకరా వేశాడు. బేగంపేటకు చెందిన ముహమ్మద్ యూనుస్ స్ట్రక్చరల్ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో పని ప్రదేశంలో వినియోగానికి ప్రత్యేకమైన చేతి తొడుగులు ఏమైనా ఉన్నాయా అని ఇండియామార్ట్ సైట్​లో వెతికారు. ఒక సంస్థలో అలాంటి వస్తువును గుర్తించారు. వెంటనే ఆ సంస్థ యజమానితో మాట్లాడారు. దాదాపు 6.50 లక్షలు విలువ చేసే చేతి తొడుగులకు ఆర్డర్ ఇచ్చారు.

ఆ మొత్తాన్ని ముందుగానే పంపించాలని ఆ సంస్థ యజమాని చెప్పాడు. దీనితో ఆన్​లైన్ ద్వారా డబ్బు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ యజమాని ఫోన్ స్పందించడం లేదు. తాను మోసపోయినట్లు గ్రహించిన యూనుస్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కోవాక్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశ విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.