ETV Bharat / state

CWC Meeting in Hyderabad Today : హైదరాబాద్‌లో ఇవాళ, రేపు కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు - CWC Meeting in Hyderabad 2023

CWC Meeting in Hyderabad Today : రానున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వ్యూహ రచనే ఎజెండాగా హైదరాబాద్‌లో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. విజయభేరి బహిరంగ సభ సైతం ఉండటంతో.. ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తారు. జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతున్నందున దానిపైనా సమాలోచనలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

CWC Meeting
CWC Meeting in Hyderabad Today
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 7:19 AM IST

CWC Meeting in Hyderabad Today హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు

CWC Meeting in Hyderabad Today : హైదరాబాద్‌ వేదికగా నేటి నుంచి రెండు రోజులపాటు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తరలిరానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం అనూహ్యంగా ఏదైనా కొత్త బిల్లు ప్రవేశపెడితే ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది.

Khammam Congress Clash 2023 : ఖమ్మం కాంగ్రెస్​లో అంతర్యుద్ధం.. ఉప్పునిప్పులా భట్టి, రేణుక వర్గాలు

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ అత్యంత ప్రాధాన్యమిస్తుందనే సందేశాన్ని.. ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతోనే సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది తెలంగాణలో సమావేశంలో నిర్వహిస్తుండటంతో.. అధిష్ఠానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చని సీనియర్‌ నేతలు చెప్పారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్‌ రెడ్డి(TPCC Chief Revanth Reddy), భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరవుతారు.

"తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు, సమాన అభివద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదని గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడ మూడు రోజులు ఉండి ఏఐసీసీ కార్యక్రమాలు పరిశీలిస్తారు. ప్రజలకు నమ్మకం కలిగేలా 6 గ్యారెంటీలను ప్రకటించచచబోతున్నారు. వాటిని 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తీసుకుంటుంది." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Congress Vijayabheri Sabha in Tukkuguda : 'విజయ భేరి' విజయానికి కాంగ్రెస్ పక్కాప్లాన్.. సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్

CWC Meeting in Hyderabad 2023 : శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ జాతీయ నేతలు.. జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా తుక్కుగూడకు వెళ్లి విజయభేరి సభా వేదికను పరిశీలించారు. ఆ తర్వాత తాజ్‌కృష్ణా హోటల్‌కు వచ్చి సమావేశాల సన్నాహకాలపై సమీక్షించారు. శనివారం మధ్యాహ్నం తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC Chief Mallikarun Kharge) అధ్యక్షత వహిస్తారు. కమిటీ సభ్యులు సోనియా, రాహుల్‌ సహా ఇతర నేతలంతా ఇందులో పాల్గొంటారు.

Congress Vijayabheri Sabha 2023 : ఈ సమావేశానికి కొనసాగింపుగా ఆదివారం ఉదయం పదిన్నరకు ఇదే హోటల్‌లో సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఇందులో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శానససభ, మండలి పక్ష కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటారు. ఇది ముగిశాక మధ్యాహ్న భోజనం చేసి నేతలంతా తుక్కుగూడలో జరిగే ‘విజయభేరి సభకు హాజరవుతారు. అక్కడ సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, భట్టి, రేవంత్, ఠాక్రేలు ప్రసంగించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పే ఆరు ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని విజయభేరి సభలో సోనియా విడుదల చేయనున్నారు.

"తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని నేను గ్యారెంటీగా చెప్పగలను. ప్రస్తుతం.. దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా తెలంగాణ మారింది. ఎక్కడ చూసినా అవినీతే. అరాచక పాలనే. ఈ పరిస్థితిపై.. ప్రజలు విసిగిపోయారు. అక్కడేమో మోదీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇక్కడేమో కేసీఆర్‌ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రెండుచోట్ల.. ప్రజలు ఇబ్బందిని గుర్తిస్తున్నారు ఈ పరిస్థితిలో ఇక్కడ జరిగే సమావేశం.. తెలంగాణ రాజకీయాల్లో ఓ గేమ్‌ ఛేంజర్‌ కానుంది. ఇది మీరే గమనిస్తారు." - కె.సి.వేణుగోపాల్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు బీజేపీకు చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అగ్ర నేతలందరికీ సమావేశం జరిగే తాజ్‌కృష్ణా హోటల్‌లోనే బస చేసేందుకు 130 గదులను పీసీసీ ముందస్తుగా రిజర్వు చేసింది. సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ కూడళ్లను కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీల ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో ముంచెత్తారు. సమావేశాలకు వేదికైన హోటల్‌ తాజ్‌కృష్ణా పరిసర ప్రాంతాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!

Congress Vijayabheri Sabha 2023 : తుక్కుగూడ 'విజయ భేరి' బహిరంగ సభ.. భారీ జన సమీకరణపై కాంగ్రెస్‌ ఫోకస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.