Customer Care Fraud Cheaters Arrest : హాలో మేము కస్టమర్ కేర్(Customer Care Fraud) నుంచి మాట్లాడుతున్నాము.. మీరు ఇన్సురెన్స్ తీసుకున్నారు కదా.. మీరు తీసుకున్న పాలసీకి ఇంకో పాలసీ కడితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి.. అదనంగా మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పాలసీ(Policy)ని తీసుకోవాలనుకుంటే వెంటనే మీకు పంపిన లింక్‌పై క్లిక్ చేయండని.. తీసుకుంటే మీకే మంచిదని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తారు. ఈ మధ్య అలాంటి కస్టమర్ కాల్ సెంటర్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ బెనిఫిట్స్ గురించి ఆలోచించి వారు చెప్పినట్లుగా పాన్‌నంబరు, బ్యాంకు వివరాలు చెప్పిన.. వారు పంపిన లింక్‌ను క్లిక్ చేసినా మీ అకౌంట్లో డబ్బులు గోవిందా.
తాజాగా ఇలానే సైబర్ మోసగాళ్ల(Cyber Crimes) వలలో పడి హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగిని ఏకంగా రూ.45 లక్షలను పోగొట్టుకుంది. చివరికి మోసపోయానని గమనించి.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కాల్ సెంటర్‌పై దాడి చేసి నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు
Customer Care Fraud 4 Members Arrest : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఫేక్ కస్టమర్ కేర్‌ను దిల్లీ కేంద్రంగా నడుపుతున్నారు. వీరి ప్రధాన లక్ష్యం ఇన్సురెన్స్ కట్టిన వారిని ఐడెంటిఫై చేసి.. కాల్ చేస్తారు. పాలసీ కట్టిన వారిని ఇంకో పాలసీ కట్టాలని.. ఉన్న పాలసీలో కంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని నమ్మిస్తారు. అలా మోసపోయిన ఓ విశ్రాంత ఉద్యోగిని నుంచి ఏకంగా రూ.45 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆమె తను మోసపోయాననే విషయం గ్రహించి.. హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Loan App Harassment Hyderabad : లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్‌ఫుల్ బ్రదర్!
Customer Care Fraud in Insurance : బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు లాప్‌టాప్‌లు, 40 సెల్ఫోన్లు, 3 వాకీ టాకీలు, కస్టమర్స్ డీటెయిల్స్ ఉన్న పుస్తకాలు, ఇన్సురెన్స్ డేటా షీట్స్ వంటివి స్వాధీనం చేసుకున్నారు. సైబర్ ఫ్రాడ్స్, ఫేక్ కాల్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర జాయింట్ సీపీ క్రైం గజారావు భూపాల్ విజ్ఞప్తి చేశారు.
Cyber Crime Latest News : ఇన్సురెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆకాల్స్ కంపెనీ నుంచి వస్తున్నాయా లేదా అని ముందుగా నిర్ధారించుకోవాలని కోరారు. పాలసీ లాప్స్ అవుతుందంటే వెంటనే నమ్మకండని.. కంపెనీ నుంచి వచ్చే కాల్స్ ల్యాండ్ లైన్ నంబర్ నుంచి వస్తాయని వివరించారు. మొబైల్ నంబర్ నుంచి వస్తే.. అవి ఫేక్ కాల్స్ అని గుర్తించుకోవాలని అన్నారు. ఈ మధ్య విదేశీ నంబర్లు నుంచి కూడా చీటర్స్ కాల్స్ చేస్తున్నారని వాపోయారు.
Fake Rank Card NIT Warangal Admission : నకిలీ ర్యాంక్ కార్డుతో NITలో ప్రవేశానికి యత్నం.. చివరకు..?