ETV Bharat / state

రక్షణ లేని ట్రాన్స్​ఫార్మర్.. బాలుడికి కరెంట్​ షాక్!

ఓ బాలుడు ఆడుకుంటూ ట్రాన్స్​ఫార్మర్ వద్దకు వెళ్లి తగిలాడు. విద్యుదాఘాతంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

బాలుడికి కరెంట్​ షాక్!
author img

By

Published : Jun 26, 2019, 6:05 PM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని చింతల్​మెట్ వద్ద ఫరీద్ అనే 5 ఏళ్ళ బాలుడికి విద్యుదాఘాతం వల్ల తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చింతల్​మెట్ వద్ద ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ట్రాన్స్​ఫార్మర్ తీగలు తేలి ప్రమాదకరంగా ఉంది. బాలుడు ఫరీద్‌ ఆడుకుంటూ వెళ్లి ట్రాన్స్ ఫార్మర్​కు తగలడం వల్ల విద్యాదాఘాతంతో చేతులు, కాళ్ళతో పాటు తలకు గాయాలై రక్తస్రావం జరిగింది. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడ్డారు. జనావాసాల మధ్య రక్షణ చర్యలు లేకుండానే ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేయడం వల్లనే బాలుడికి గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా.. అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. బాలుడికి జరిగిన ప్రమాదంపై పూర్తిగా విద్యుత్ అధికారులే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాలుడికి కరెంట్​ షాక్!

ఇవీ చూడండి: బుల్లితెర నటి అదృశ్యం... అనుమానం ఎవరి మీదంటే..?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.