ETV Bharat / state

దోసకాయ లస్సీ ఇలా తయారు చేసుకోండి

ఆరోగ్యానికి, అందానికి కీరా రూటే సపరేట్​. అంతటి కీరా కిటుకులకు, పోషకాల పెరుగు తోడైతే ఇంకేముంది... ఎప్పుడూ భగ భగ మండే భానుడైనా చల్లబడాల్సిందే. అందుకే చల్లబరిచే కూల్​ కూల్​ కుకుంబర్​ లస్సీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.. కాదు కాదు చేసేద్దాం...!

author img

By

Published : Apr 29, 2020, 2:36 PM IST

cucumber-lassi-preparation-process
దోసకాయ లస్సీ ఇలా తయారు చేసుకోండి

కావలసిన ప‌దార్థాలు:

  • కీరదోస: రెండు
  • పెరుగు: అరలీటరు
  • అల్లం: 2 అంగుళాల ముక్క
  • కొత్తిమీర తురుము: 2 టేబుల్ ‌స్పూన్లు
  • పచ్చిమిర్చి: రెండు
  • పంచదార: 4 టేబుల్‌స్పూన్లు
  • ఇంగువ: చిటికెడు
  • ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం:

* కీరా ముక్కలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార, ఇంగువ, ఉప్పు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
* అందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ తిప్పాలి. ఇప్పుడు దీన్ని గ్లాసుల్లో పోసి ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లగా అందించాలి.

ఇవీ చూడండి: బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.