ETV Bharat / state

'తెలంగాణతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు క్యూబా సిద్ధం' - హైదరాబాద్​లో క్యూబా సెంటర్

హైదరాబాద్‌లో క్యూబా ట్రేడ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌తో కలిసి ఆ దేశ రాయబారి అలెగ్జెండ్రో మారిన్‌ దీన్ని ఆవిష్కరించారు. శుక్రవారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఇండియా, క్యూబా సమ్మిట్‌-2022కు మారిన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

cuba center
'ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు క్యూబా సిద్ధం'
author img

By

Published : Mar 19, 2022, 12:26 PM IST

తెలంగాణతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింతగా మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం అంకితభావంతో ఉందని క్యూబా రాయబారి అలెజాండ్రో సిమాన్కస్‌ మారిన్‌ అన్నారు. బయోఫార్మా, ఐటీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగాల్లో దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగితే తెలంగాణ, క్యూబాలకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఇండియా క్యూబా ట్రేడ్‌ సమ్మిట్‌ పేరిట సమావేశాన్ని నిర్వహించారు.

cuba center
'ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు క్యూబా సిద్ధం'

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అలెజాండ్రో మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో పోల్చుకుంటే క్యూబా ఎంతో చిన్న దేశం. ఆర్థికంగా పురోగతి సాధించింది. కొవిడ్‌ కారణంగా గత ఏడాది జీడీపీ తగ్గిపోయింది. ఇటీవల మళ్లీ 2 శాతం వృద్ధి సాధించింది. పర్యాటకంగా క్యూబాకు మంచి గుర్తింపు ఉంది. వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణతో క్యూబా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది’’ అని వివరించారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. వ్యాపార అనుకూలమైన రాష్ట్రం కావడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.