ETV Bharat / state

విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన

ఏపీ విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన బాధిత గ్రామ ప్రజల ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వం ఏడాదిపాటు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. దుర్ఘటన జరిగిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లు తినరాదని సిఫార్సు చేసింది.

విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన
విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన
author img

By

Published : May 11, 2020, 11:40 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్​ఐఆర్​-ఎన్​ఈఈఆర్​ఐ నిపుణుల బృందం.. నివేదికను కేంద్రానికి సమర్పించింది. పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇళ్లలో స్టైరిన్‌ అవశేషాలు గుర్తించిన నిపుణులు... భూమి లోపల 1.5 పీపీఎం, భూ ఉపరితరంలో 4.5 పీపీఎంపైన ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఓ ఇంట్లో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరిన్‌ గుర్తించినట్లు నివేదికలో తెలిపారు.

నిపుణుల బృందం సిఫార్సు చేసిన అంశాలు

  1. ప్రభావిత ప్రాంతాలైన వెంకటాపురం, వెంకటాద్రి నగర్, నందమూరి నగర్, పైడిమాంబ కాలనీ, బీసీ కాలనీ ప్రజలు.. ఘటన జరిగిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లు తినరాదు.
  2. పశువులకు అక్కడి గ్రాసాన్ని అందించరాదు.
  3. తదుపరి నివేదిక వచ్చే వరకు అక్కడి పాలు, పాల సంబంధిత ఉత్పత్తులను సైతం వినియోగించరాదు.
  4. మూడు కిలోమీటర్ల పరిధిలో నీటిని తాగేందుకు, వంటకు వినియోగించకూడదు.

జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచించిన కమిటీ... అక్కడి నీరు, గాలి, మట్టిని పరీక్షిస్తాయని నిపుణుల బృందం తెలిపింది. ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రపరిచాలని సూచించిన నిపుణుల బృందం... తిరిగి ఆ ప్రాంతాలను నీటితో శుభ్రపరిచే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సూచించింది. స్టైరిన్ ప్రభావానికి లోనైన మొక్కలను తొలగించాలని తెలిపింది. నివాసాలను పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాలని బృందం తెలిపింది. ఎన్​జీటీ (జాతీయ హరిత ట్రైబ్యునల్) కూడా ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించనుంది.

ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.