వేసవిలో ప్రతికూల పరిస్థితుల రీత్యా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులు పునరుద్ధరించామని తెలిపారు.
ప్రజల దాహార్తిని తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. జులై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని కేంద్ర కేబినెట్ సెక్రటరీకి వివరించారు. రాష్ట్రంలో ఏప్రిల్‌లో ఆరు రోజులు, మే నెలలో పది రోజులు వడగాలులు వీచాయని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో కరవు నివారణ కార్యాచరణ, భూగర్భ జలాలు, దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, రుతు పవనాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి: 'వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'