రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణా చర్యలు, లాక్డౌన్ అమలు తీరు, పేదలు, వలసకూలీలకు అందిస్తున్న సాయం, తదితర వివరాలను సీఎస్ సోమేశ్ కుమార్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వివరించారు. రాజ్‌భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసిన సీఎస్... కంటైన్మెంట్ ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను కూడా తమిళిసైకి తెలిపారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో పేదలకు భోజనం పంపిణీ చేశారు. అలాగే తమిళ నూతన సంవత్సరం సందర్భంగా రాజ్‌భవన్‌లో కుటుంబసభ్యులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు.