కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని... రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్నవారిని సూపర్ స్ప్రెడర్లుగా ప్రభుత్వం గుర్తించిదన్నారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వీరికి ప్రత్యేకంగా టీకా పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.
పౌరసరఫరాల శాఖ సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, వివిధ దుకాణాల్లో పనిచేసే వారికి సూపర్ స్ప్రెడర్ల కేటగిరీలో వ్యాక్సిన్ వేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగానే హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు