cs visit rangareddy collector office : ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. 317 ఉత్తర్వుకు అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సమావేశమయ్యారు.
ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సీఎస్ సోమేశ్ కుమార్ను కోరాయి. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చారు. సమావేశంలో రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: TS Teachers Transfers: తప్పుల తడకగా సీనియారిటీ జాబితా.. ఉపాధ్యాయుల అభ్యంతరాలు