సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ధరణి ద్వారా సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరుగుతోందని తెలిపారు. కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పేర్లు మారుతాయని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ల కోసం 570 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నెలకొల్పామని.. ఎలాంటి అవకతవకలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులు కూడా మొదలయ్యాయని.. త్వరలోనే నాలా ఆటోమేషన్ ప్రాసెస్, వ్యవసాయేతర ఆస్తుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి : ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి చందంగా