ETV Bharat / state

CS Somesh Kumar: వైద్యారోగ్య శాఖలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి - సీఎస్​ సోమేశ్​కుమార్​ చర్చ

వైద్యారోగ్య శాఖలో ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని సీఎస్ సోమేశ్ ​కుమార్​ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖలో మౌలిక సదుపాయాల బలోపేతంపై సమీక్ష నిర్వహించారు.

CS Somesh Kumar
సీఎస్ సోమేశ్ ​కుమార్
author img

By

Published : Jul 24, 2021, 9:20 PM IST

వైద్యారోగ్య శాఖలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని... తగినన్ని మందులు నిల్వ ఉండేలా చూడాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఆదేశించారు. డయోగ్నోస్టిక్, బయోమెడికల్​ పరికరాలు, టెస్టింగ్​ కిట్లు, ఇతర నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు... వైద్యారోగ్య శాఖలో మౌలిక సదుపాయాల బలోపేతంపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని సీఎస్​ అధికారులను ఆదేశించారు.

వాటి సంఖ్య పెంచాలి

వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ఆక్సిజన్ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలన్నింటిని ఆక్సిజన్ బెడ్లుగా మార్పు, లిక్విడ్​ మెడికల్ ఆక్సిజన్​ అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, పీడియాట్రిక్​ ఆక్సిజన్​, ఐసీయూ పడకల సంఖ్యను పెంచాలని సీఎస్​ సూచించారు. జిల్లా ఆసుపత్రుల బలోపేతం, అప్‌గ్రేడ్‌ చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

సిద్ధంగా ఉండాలి..

వర్షాకాలంలో వచ్చే సీజనల్​ వ్యాధులకు తగిన చికిత్స చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మూడో దశ వచ్చినా... సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవల కొత్తగా మంజూరు చేసిన ఏడు వైద్య కళాశాలల పురోగతిపైనా సీఎస్‌ చర్చించారు.

ఇదీ చూడండి: CM KCR Phone Call: హుజూరాబాద్​పై కేసీఆర్ మాస్టర్​ ప్లాన్.. ఆడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.