ETV Bharat / state

'ఆక్సిజన్​ రవాణాకు అంతరాయం రాకుండా చూడండి' - హైదరాబాద్​ వార్తలు

మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా వేగవంతం చేయాలని అధికారులకు సీఎస్​ సోమేశ్​ కుమార్​ సూచించారు. రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో సీఎస్... బీఆర్కే భవన్​లో సమావేశమయ్యారు.

cs somesh kumar review
cs somesh kumar review
author img

By

Published : May 7, 2021, 9:33 PM IST

మెడికల్​ ఆక్సిజన్​ ట్యాంకర్ల రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని అంగూరు, కర్నాటకలోని బళ్లారి నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా వేగవంతంగా జరిగేలా నిపుణులతో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైల్వే అధికారులతో చర్చించి ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​కు గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించేలా చూడాలని... తద్వారా రవాణాకు పట్టే సమయం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గుతుందని పేర్కొన్నారు.

మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు మెకానిక్స్, ఇతర నిపుణులను కూడా పంపాలని తెలిపారు. కార్గో ఎయిర్ క్రాఫ్ట్​ల ద్వారా సులువుగా తరలించేలా ట్యాంకర్లకు అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. ట్యాంకర్ల రవాణా ప్రక్రియ నిరంతరం సాఫీగా సాగేలా డ్రైవర్లు, మెకానిక్స్​తో బృందాలను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 30 ట్యాంకర్లకు అదనంగా ప్రైవేట్ గుత్తేదార్ల నుంచి అదనపు ట్యాంకర్లను సమకూర్చుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి: జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి: మేయర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.